ఉద్యోగులు ఇక ధైర్యంగా నార్మల్ కాల్ మాట్లాడొచ్చు.. : కోదండరాం

by Disha Web Desk 4 |
ఉద్యోగులు ఇక ధైర్యంగా నార్మల్ కాల్ మాట్లాడొచ్చు.. : కోదండరాం
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది. ఉద్యమం సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం అక్కడకు చేరుకుని ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకాలం ఒక కుటుంబం చేతుల్లో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందన్నారు. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతున్నదన్న అభిప్రాయం ఉద్యోగుల్లో, ప్రజల్లో కనిపిస్తున్నదన్నారు. ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాల్‌‌లో మాట్లాడుకునేవారని, ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని, ఫోన్ సంభాషణల మీద నిఘా పోయిందన్నారు.Next Story

Most Viewed