ఎన్నికలే టార్గెట్.. గ్రూప్ రాజకీయాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్

by Disha Web Desk 4 |
ఎన్నికలే టార్గెట్.. గ్రూప్ రాజకీయాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్
X

సీనియర్‌లు, ‌జూనియర్‌లు, పార్టీ ప్రజా ప్రతినిధులం అంటూ గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న బీజేపీ నాయకులకు కేంద్ర నాయకత్వం షాకిచ్చేందుకు సిద్ధమైంది. పార్టీని నమ్ముకుని పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు మళ్లీ మంచి రోజులు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇటీవల కర్ణాటకలో బీజేపీకి ఓటర్లు షాకివ్వడంతో పాత నాయకులకు, క్యాడర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25న నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో అందుకు పునాదులు పడ్డాయి. మోడీ ప్రభుత్వ పాలన తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో 2019 ఎన్నికలలో పార్లమెంట్ స్థానంను, తరువాత జరిగిన ఎన్నికలలో అధిక సంఖ్యలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటిన అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. గెలిచిన వారిని కాపాడుకోలేక సతమమైంది. గ్రూప్ రాజకీయాలతో బలంగా ఉన్న బీజేపీ పార్టీ కాస్త కుదేలవ్వడం ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో లోకల్ బాడి, మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన బీజేపీ క్యాడర్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు టచ్‌లోకి వేల్లడం అందోళన కలిగిస్తుంది.

రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యమ్నాయం అంటు చెబుతున్న నాయకులు స్థానికంగా మాత్రం కలహలతో పార్టీకి చేటు కలిగిస్తున్నారనే అపవాదును జిల్లాలోని బీజేపీ నాయకులు మూటగట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారిగా లీడర్లను, క్యాడర్‌ను చేర్పించుకోవడంతో పాటు వారికి బాధ్యతలను అప్పగిస్తూ వారే క్యాండిడేట్‌లు అని ప్రచారం చేశారు. తీరా ఎన్నికల వేళ వచ్చేసరికి గెలుపు గుర్రాలకే టికెట్ లు అంటు కొత్త రాగం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమకు టికెట్ లు వస్తుందని ఆశపడ్డా వారు ముందుగానే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

బీజేపీలో గ్రూప్ రాజకీయాలు సతమతం చేస్తూ, క్యాడర్‌ను అయోమయం చేస్తుంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఓక వర్గం, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే రాష్ర్ట ఉఫాధ్యక్షుడు యెండల లక్ష్మి నారాయణల మధ్య అరవింద్ పార్టీలో చేరిన నాటి నుంచి సఖ్యత లేదు. ఎంపీగా గెలిచిన తరువాత పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టికేట్‌ల కేటాయింపు మొదలుకోని జిల్లా అధ్యక్ష పదవి, నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవులు కుడా అరవింద్ చెప్పిన వారికి ఇవ్వడంతో ఇద్దరి మధ్య విబేధాలు ముదిర పాకాన పడ్డాయి. బీజేపీ నాయకులు తమ మధ్య విబేదాలను పక్కన పెట్టి కలిసి పని చేస్తారా లేక ఒకరి వెనుక మరోకరు గోతులు తవ్వి బీజేపీ పార్టీని బొంద పెడుతారా అనేది ఎన్నికల నాటికి క్లియర్ కావడం ఖాయంగా ఉంది.

Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి గెలుపు సాధ్యమేనా?



Next Story

Most Viewed