తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం

by Disha Web Desk 4 |
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియగా గడ్డం ప్రసాద్ ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఎకగ్రీవమైనట్లైంది. ప్రసాద్ కుమార్ ఎన్నికను రేపు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించనున్నారు.

దీంతో గడ్డం ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత స్పీకర్‌గా రికార్డు కెక్కనున్నారు. కాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్రటరీ గత సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం ఉండగా ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు హాజరయ్యారు.

Next Story

Most Viewed