కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయింది.. BRS పార్టీపై ఈటల సెటైరికల్ కామెంట్స్

by Disha Web |
కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయింది.. BRS పార్టీపై ఈటల సెటైరికల్ కామెంట్స్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: భారత రాష్ట్ర సమితి (BRS) ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. BRS ప్రకటనపై బుధవారం ఈటల స్పందించారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారు. ఆ పార్టీ స్థాపనతోనే తెలంగాణాకు, కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని, తెలంగాణ ప్రజానీకానికి, టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయింని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి, కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపారు.

'కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకుంది మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను,.అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయంగా చెలామణి చేయాలని కల పగటికలకంటున్నారు. అది కలగా మిగిలిపోతుందో చూడాలి. ఒకటి నిజం కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు ఉంది. తెలంగాణలో ఉన్న సమస్యలు పరిష్కరించలేనివాడు.. అనేక రకాల ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు' అని ఈటల రాజేందర్ అన్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed