ముగిసిన విద్యాశాఖ మీటింగ్.. కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వ సూచనలివే!

by Disha Web Desk 2 |
ముగిసిన విద్యాశాఖ మీటింగ్.. కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వ సూచనలివే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ మీటింగ్ ముగిసింది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఈ సందర్భంగా కాలేజీలకు ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. సోమవారం జరిగిన ఈ సమావేశానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్, బోర్డు అధికారులు, కాలేజీల యాజమాన్యాలు బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కాలేజీలు అదనపు బ్రాంచ్‌లు నిర్వహించవద్దని ఈ నిబంధన వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలని ఆదేశించింది. అలాగే కాలేజీల్లో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వీలుగా మానసిక నిపుణులను నియమించడంతో పాటు విద్యార్థులపై దాడి చేసి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంటర్ విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ.. పదో తరగతిలో జీపీఏ (గ్రేడ్ పాయింట్ యావరేజ్) తరహాలో ఇంటర్‌లో కూడా జీపీఏ అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులపై మార్కుల ఒత్తిడి తగ్గించవచ్చని సూచన చేయగా దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఒత్తడికి దూరం చేసేలా ప్రతి మూడు నెలలకు ఓసారి కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాలని కాలేజీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులను కొట్టినా, వేధించే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిపై క్రిమినల్ చర్యలతో పాటు వారు భవిష్యత్‌లో ఎక్కడా పని చేయకుండా డిక్లేర్ చేసేలా కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని ఇంటర్ బోర్డు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed