11 గంటలకు ఈడీ విచారణ.. కాసేపట్లో మీడియా ముందుకు కవిత!

by Disha Web Desk 2 |
11 గంటలకు ఈడీ విచారణ.. కాసేపట్లో మీడియా ముందుకు కవిత!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసులో మూడోసారి ఈడీ విచారణకు ఇవాళ(మార్చి 21) ఎమ్మెల్సీ కవిత హాజరు కాబోతున్నారు. విచారణ నేపథ్యంలో మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కవిత భేటీ అయ్యారు. తాజాగా.. ఈ భేటీ ముగియడంతో మళ్లీ ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీగా చేరుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈరోజు విచారణ అత్యంత కీలంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈడీ విచారణకు వెళ్లేముందు ఆమె మీడియాతో మాట్లాడబోతున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. మీడియాతో కీలక విషయాలు పంచుకోబోతున్నట్లు సమాచారం. కాగా, కాసేపట్లో విచారణ ఉన్న నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టు లాయర్లతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆ లాయర్లు ఎవరు? వారి నుంచి కవిత ఎటువంటి సలహాలు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది.

Also Read...

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌లో కొత్త లొల్లి!

Next Story