- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ విచారణ వేగవంతం

దిశ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం (Sheep distribution scheme)లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు (ACB officials) విచారణ కొనసాగిస్తున్నారు. అయితే భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈడీ అధికారులు జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ గొర్రెల పంపిణీ స్కాం కేసు (Sheep distribution scam case) విచారణను ఈడీ అధికారులు (ED officials) వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Assistant Director of Animal Husbandry Department) నేడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అమలైన ఈ గొర్రెల పెంపకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. దీని ఆధారంగా చేసుకొని గొర్రెల పంపిణీ అవకతవకలపై పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కీమ్‌లో రూ.700 కోట్లు అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.