తెలంగాణలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Mahesh |
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు వ్యతిరేకంగా 6 అబద్దాలు 66 మోసాల పేరుతో బీజేపీ(BJP) కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ముగింపుగా ఈ రోజు హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ స్టేడియంలో సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress party).. ఎ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని, చేసే పరిస్థితిలో కూడా లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం(Financial crisis) నెలకొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు ఇంకా రుణమాఫీ పూర్తి చేయలేదని, ఏడాది గడిచిన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. పింఛన్ పెంచలేదని, మహిళలకు ఇస్తానన్న తులం బంగారం ఊసేలేదు.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని.. కనీసం ప్రభుత్వ ఉద్కోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి(Kishan Reddy) చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed