ఢిల్లీలో బిజీబిజీగా ఈటల.. కేంద్ర మంత్రులతో భేటీ

by prasad |
ఢిల్లీలో బిజీబిజీగా ఈటల.. కేంద్ర మంత్రులతో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో బిజీబిడీగా గడుపుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం నిమిత్తం హస్తినాకు వెళ్లిన ఈటల అక్కడే ఉండిపోయారు. తాజాగా మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రోడ్డురవాణా, జతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు మరేంద్ర మోడీ 3.0 సర్కార్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో వీరికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈటల రాజేందర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వరించబోతున్నదనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఈటల రాజేందర్ కు అప్పగించడం ద్వారా పార్టీ మైలేజ్ పెరుగుతుందనే చర్చ కమలం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకు అధిష్టానం సైతం సుముఖంగా ఉందని అన్ని సజావుగా జరిగితే అతి త్వరలోనే ఈటలను రాష్ట్ర అధ్యక్ష పదవి వరించడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed