ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రిలీజ్.. ముహూర్తం ఖరారు..

by Dishafeatures2 |
ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రిలీజ్.. ముహూర్తం ఖరారు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌- 2022 ఫలితాలు, టీఎస్ ఈసెట్-2022 ఫలితాలను శుక్రవారం ఆగస్టు 12న జేఎన్టీయూలోని ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఎంసెట్ ఫలితాల, 11.45 గంటలకు ఈసెట్‌ ఫలితాలు విడుదల అవుతాయని జేఎన్టీయూ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంసెట్ ఫలితాలను www.eamcet.tsche.ac.inలో చూసుకోవాలని, టీఎస్ ఈసెట్ ఫలితాలను www.ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నంబరును ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవాలని సూచించారు.

ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ ప‌రీక్షల‌ను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుత‌ల్లో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ విభాగాల‌కు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షకు 80,575 మంది విద్యార్ధులు హాజరయ్యారు. టీఎస్‌ఈసెట్‌-2022 ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షకు 22,001 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఫలితాలు విడుదల చేయడానికి హాజరుకానున్నారు.


Next Story

Most Viewed