ఎంసెట్ ​గడువు క్లోజ్.. ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చాన్స్

by Disha Web |
ఎంసెట్ ​గడువు క్లోజ్.. ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంసెట్​దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. శనివారం సాయంత్రం 4:30 వరకు 2,49,708 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజనీరింగ్​ విభాగంలో 1,61,552 మంది నమోదు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్​ విభారగంలో 88,156 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్​పేర్కొన్నారు. రూ.250 ఆలస్య రుసుముతో వచ్చే నెల 7 వరకు, రూ.500 లేట్ ఫీ తో వచ్చే నెల 17 వరకు, రూ. 2,500 ఆలస్య రుసుముతో వచ్చేనెల 27 వరకు, రూ.5000 లేట్​ఫీజుతో జూలై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఏడాది ఎంసెట్​కు 2 లక్షల 51 వేల దరఖాస్తులు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య క్రాస్ అయ్యే అవకాశం ఉంది. జూలై 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పలు విభాగాల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు.

Next Story