బీఆర్ఎస్‌కు మరో షాక్.. దూదిమెట్ల బాలరాజు యాదవ్ రాజీనామా?

by GSrikanth |
బీఆర్ఎస్‌కు మరో షాక్.. దూదిమెట్ల బాలరాజు యాదవ్ రాజీనామా?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు కవిత లిక్కర్ కేసు వ్యవహారం గులాబీ బాస్‌ను కుదిపేస్తుండగా.. మరోవైపు ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా కీలక నేతలంతా వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనిఅయిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని వార్తలు విస్తృతం కావడంతో ఆ రెండు పార్టీల్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా.. మరో కీలక నేత బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్ర అసంతృప్తి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే భువనగిరి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, భువనగిరి స్థానానికి క్యామ మల్లేశ్‌ కుర్మను అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు.

Next Story