- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
DSC అభ్యర్థులకు బిగ్ అలర్ట్: రేపటి నుంచే అప్లికేషన్స్ స్టార్ట్.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 5089 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు1739, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2575 పోస్టులను భర్తీ చేయనుంది. కాగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 20వ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ ముగియనుంది. అప్లికేషన్ ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. కాగా పరీక్షలను నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా ఎగ్జామ్స్ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఇతర వివరాలకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని అధికారులు స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 33 జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు రోస్టర్‌పై విద్యాశాఖ ఆలస్యంగా అయినా క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి ఈనెల 15వ తేదీలోపే జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు కేటగిరీ వారీగా రోస్టర్ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. కానీ విడుదల చేయలేదు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఆగ్రహంగా ఉన్నారు. ఇదిలా ఉండగా 5089 పోస్టుల్లో అగ్రభాగం మహిళా అభ్యర్థులకే కేటాయించారు. వర్టికల్ పద్ధతిలో రోస్టర్ వెలువరించారు.
కాగా పది జిల్లాల్లో డబుల్ డిజిట్‌లోనే ఖాళీలు ఉండటం గమనార్హం. కాగా పెద్దపల్లి జిల్లాలో అత్యల్పంగా 43 పోస్టులు మాత్రమే ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో మొత్తం 54 పోస్టులు, జనగామలో 76, భూపాలపల్లిలో 74, కరీంనగర్ 99, మహబూబ్ నగర్ 96, మేడ్చల్ మల్కాజ్ గిరి 78, ములుగు 65, వనపర్తి 76, యాదాద్రి భువనగిరి 99 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక 100 నుంచి 150 పోస్టులు ఉన్న జిల్లాలే అధికంగా ఉన్నాయి. ఎస్జీటీ తెలుగు మీడియంలో అధిక పోస్టులు కేటాయించారు. ఉర్దూ మీడియంలోనూ భారీగానే భర్తీ చేయనున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియంకు పోస్టులు కేటాయించారు.
స్కూల్ అసిస్టెంట్ విభాగంలో బయాలజీ, సోషల్‌లో ఎక్కువ పోస్టులున్నాయి. తెలుగు పండిట్ పోస్టులు సైతం ఉన్నాయి. కాగా తక్కువ పోస్టులు ఉన్న జిల్లాల్లో అభ్యర్థులు తీవ్ర ఆదవేన వ్యక్తంచేస్తున్నారు. విద్యాశాఖలో ఖాళీలు భారీగానే ఉన్నప్పటికీ అన్ని పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయడంలేదని వారు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో పలుమార్లు 13500 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని వారు ఆందోళనలు కొనసాగించారు. కానీ ప్రభుత్వం నిరుద్యోగుల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం 5089 పోస్టుల భర్తీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News