స్నాప్‌చాట్​ ద్వారా పరిచయాలు.. ఆ తర్వాత డ్రగ్స్​ అమ్మకాలు

by Disha Web Desk 12 |
స్నాప్‌చాట్​ ద్వారా పరిచయాలు.. ఆ తర్వాత డ్రగ్స్​ అమ్మకాలు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: రాడిసన్​హోటల్​డ్రగ్​కేసులో అరెస్టయిన మీర్జా వహీద్​స్నాప్​చాట్​ద్వారా పరిచయాలు ఏర్పరుచుకుని కొకైన్ ​అమ్ముతున్నట్టుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. గచ్చిబౌలిలోని ఐఎస్బీ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్​ప్రాంతాల్లో ఉంటున్న పలువురు ప్రముఖులకు కొకైన్​సరఫరా చేస్తున్నట్లు తేలింది. తాజాగా వెలుగు చూసిన రాడిసన్​హోటల్ డ్రగ్​పార్టీ కేసులో మీర్జా వహీద్​ను గచ్చిబౌలిలోని ఐఎస్బీ వద్ద అరెస్ట్​చేసిన గచ్చిబౌలి పోలీసులు అతని నుంచి 3.58 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. రాడిసన్​హోటల్​డ్రగ్​కేసులో 2వ నిందితునిగా ఉన్న పాతబస్తీ యాఖుత్​పురా ప్రాంత నివాసి సయ్యద్​అబ్బాస్​అలీ జాఫ్రీని విచారించినపుడు మీర్జా వహీద్​పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. యాఖుత్​పురా ప్రాంతానికే చెందిన మీర్జా వహీద్​ఏడాది కాలం నుంచి సయ్యద్​అబ్బాస్​అలీ జాఫ్రీ ద్వారా కొకైన్​విక్రయాలు జరిపిస్తూ వస్తున్నట్టుగా దర్యాప్తులో తేలింది.

10 సార్లకు పైగా..

మీర్జా వహీద్​ను జరిపిన విచారణలో ఒక్క ఫిబ్రవరి నెలలోనే అతను 10సార్లకు పైగా కొకైన్​ను సయ్యద్​అబ్బాస్​అలీ జాఫ్రీకి అమ్మినట్టుగా స్పష్టమైంది. ఇలా తీసుకున్న కొకైన్​ను సయ్యద్​అబ్బాస్​అలీ జాఫ్రీ 2వేల రూపాయల కమీషన్​ పై మంజీర గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్ డైరెక్టర్​ వివేకానంద్​కు అమ్మినట్టుగా తేలింది. ఇక, మరో ఇద్దరు డ్రగ్​పెడ్లర్లయిన అబ్దుల్​రెహమాన్​తోపాటు ఇమ్రాన్​తో కూడా మీర్జా వహీద్​కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది. మీర్జా వహీద్​ను కోర్టులో హాజరుపరిచినపుడు రిమాండ్​రిపోర్టులో ఈ వివరాలను గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ రిమాండ్​రిపోర్టులో కూడా పోలీసులు టాలీవుడ్​డైరెక్టర్​క్రిష్​జాగర్లమూడి పేరును ప్రస్తావించటం. రాడిసన్​హోటల్​లో జరిగిన డ్రగ్​పార్టీకి 10మంది హాజరైనట్టుగా పేర్కొన్నారు.


Next Story

Most Viewed