అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా డబుల్ ఇండ్లు.. పట్టించుకోని అధికారులు

by Disha Web Desk 4 |
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా డబుల్ ఇండ్లు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, వేములపల్లి : దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన పేద ప్రజల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కల కలగానే మిగిలిపోతుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో పంపిణీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్న పేద ప్రజలకు నిరాశే మిగులుతుంది. కొంతమంది లబ్ధిదారులమనుకున్న వారు కూడా సొంత డబ్బులతో ఇండ్ల నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తయిన కూడా పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలతో పాటు మండల స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వేములపల్లి మండలం మొలక పట్నం గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కొక్క ఇంటికి సుమారు 6.29 లక్షల రూపాయలతో 20 ఇండ్లకు 125.80 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం పూర్తి చేశారు. పూర్తయిన ఇండ్లను మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 2019 జూలై నెలలో ప్రారంభించారు. ప్రారంభమైతే చేశారు కానీ నేటి వరకు కూడా పేద ప్రజలకు పంపిణీ చేయలేదు.

శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు

సుమారు నాలుగు సంవత్సరాల క్రితం పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటివరకు కూడా పంపిణీ చేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీగా కంప చెట్లు మొలవడంతో అధ్వానంగా మారాయి. కిటికీలు, తలుపులు విరిగిపోవడంతో పాటు పలుచోట్ల గోడలు కూడా కూలిపోయాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను పంపిణీ చేసిన ఎలా నివాసం ఉండాలో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారిన ఇండ్లు వేములపల్లి మండలంలోని మొలక పట్నం గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఊరి చివరన ఉండటంతో పాటు ఎవరు నివాసం లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. యువత డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆసరాగా చేసుకుని చెడు వ్యసనాలకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

ఇండ్ల నిర్మాణం చేపట్టి ఏండ్లు గడుస్తున్నా మాత్రం అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మూడు నెలల క్రితం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని గ్రామంలో దండోరా తో పాటు దరఖాస్తులు స్వీకరించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన 152 మంది దరఖాస్తు చేసుకోగా 27 మందిని అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుల స్వీకరణతో గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఆశాభావులు తమకు ఇల్లు వస్తాయని ఆశతో ఎదురు చూశారు. కానీ పేద ప్రజల ఆశ అడియాశ గానే మిగిలిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో పేద ప్రజల కోసం నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జనరల్ ఎలక్షన్ లను దృష్టిలో పెట్టుకొని అయినా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ఇల్లు పంపిణీ చేయాలి - రేమడాల కర్ణాకర్ ఉప సర్పంచ్, మొల్కపట్నం

ఇల్లు నిర్మాణం చేసి సంవత్సరాలు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదు. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి అధికారులు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల



Next Story

Most Viewed