హోమ్ వర్క్ చేయలేదని తల్లి మందలించడంతో.. బాలుడు ఏం చేశాడో తెలుసా?

by Disha Web |
హోమ్ వర్క్ చేయలేదని తల్లి మందలించడంతో.. బాలుడు ఏం చేశాడో తెలుసా?
X

దిశ, దుండిగల్: ఇంట్లో హోమ్ వర్క్ చేయలేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా హర మండలానికి చెందిన లావేటి రాజు, శ్రావణి భార్యా భర్తలు. వారికి ఇద్దరు కుమారులున్నారు. రాజు ప్రైవేట్ సంస్థలో సర్వేయర్‌గా పనిచేస్తుండగా, తల్లి శ్రావణి గృహిణి. వారి చిన్న కుమారుడు రామ్ సాయి(8)‌ దుండిగల్ పరిధిలోని వివేకానంద హై స్కూల్ లో నాల్గవ తరగతి చదువుతున్నాడు.

కాగా హోమ్ వర్క్ చేయలేదని గురువారం రాత్రి మందలించింది. మరుసటి రోజు యధావిధిగా స్కూల్‌కు వెళ్లిన బాలుడు క్లాస్‌కు వెళ్లకుండా బయటకు వెళ్లిపోయాడు. పాఠశాల యాజమాన్యం తల్లి దండ్రులకు సమాచారం అందించారు. ఆందోళన చెందిన తండ్రి రాజు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. సీఐ రమణారెడ్డిని వివరణ కోరగా కేసు నమోదు చేసుకున్నామని సీసీ ఫుటేజీని పరిశీలించగా బహదూరపల్లి చౌరస్తాలో ఒంటరిగా స్కూల్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళుతున్నట్లు సమాచారం దొరికిందన్నారు. విచారణ కొనసాగుతుందని తెలిపారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed