CM KCRపై డీకే అరుణ ఫైర్.. ఇక్కడి రైతులకు రుణమాఫీ చేయడంటూ..

by Dishanational2 |
CM KCRపై డీకే అరుణ ఫైర్.. ఇక్కడి రైతులకు రుణమాఫీ చేయడంటూ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ పర్యటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గురువారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. కన్న తల్లికి తిండి పెట్టనొడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్లుగా కేసీఆర్​తీరుందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రుణ మాఫీ కోసం రైతులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారని, ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం పరామర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క రాష్ట్రం పంజాబ్‌లో రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి బయలుదేరుతున్నాడని డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజెత్తారు. సీఎం కేసీఆర్​వ్యవహారశైలి కేవలం జాతీయ స్థాయిలో ప్రచారం పొందడానికే తప్పా మరేది లేదని చురకలంటించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ముందు తెలంగాణ రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేయాలని, అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని డీకే అరుణ.. ముఖ్యమంత్రికి హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదన్నట్లుగా కేసీఆర్​వ్యవహరిస్తున్నారని డీకే అరుణ ఫైరయ్యారు. కేంద్రం పల్లెలకు నేరుగా నిధులిచ్చే విషయంపై చిల్లర వ్యవహారమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావిస్తున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేసిన నియంత ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. కేంద్రంపై వ్యాఖ్యలు చేయడంపై దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లుగా ఉందని డీకే అరుణ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఇబ్బంది తెలంగాణకు మాత్రమే ఎందుకు వస్తోందని ఆమె ప్రశ్నించారు. స్థానిక స్థానిక ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండా, తీర్మానాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రామీణ ఉపాధిహామీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, తమ అనుచరుల జేబులు నింపడానికే ఇలా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయం ప్రజలంతా గమనిస్తున్నారని, టీర్ఎస్​కు బుద్ధి చెబుతారని డీకే అరుణ హెచ్చరించారు.


Next Story

Most Viewed