- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కేసీఆర్ అంటే.. కల్వకుంట్ల చీటర్ రావు: డీకే అరుణ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ అంటే.. కల్వకుంట్ల చీటర్ రావు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ బండారం బయటపెడితే ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ఎందుకంత ఉలిక్కి పడుతున్నారని ఆమె ఫైరయ్యారు. ప్రధానిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను ఫైటర్ అని చెప్పడానికి కేటీఆర్‌కు కొంచెమైనా సిగ్గులేదా అని డీకే అరుణ మండిపడ్డారు.
కేటీఆర్.. వ్యాఖ్యలు దొంగనే దొంగ అనట్లుగా ఉందని డీకే అరుణ ఫైరయ్యారు. ప్రధానిపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, త్వరలో బీఆర్ఎస్‌ను తెలంగాణలో బొంద పెడతామని డీకే అరుణ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎంతో మంది అమాయక యువతను దుబాయ్ పేరుతో దొంగ పాస్ పోర్టులు ఇచ్చి మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని డీకే అరుణ విమర్శించారు. అందితే కాలు.. లేదంటే జుట్టు పట్టుకునే చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనని డీకే అరుణ ధ్వజమెత్తారు.