అనర్హత పిటిషన్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి‌తో పాటు 24 మంది అభ్యర్థులకు హైకోర్టు నోటీసులు

by Mahesh |
అనర్హత పిటిషన్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి‌తో పాటు 24 మంది అభ్యర్థులకు హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను గెలిపించకుంటే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. దీనిపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో గెలుపొందారని వీడియో ఆదారాలు జతపరిచి పాడి కౌశిక్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కౌశిక్ రెడ్డి తో పాటు మరో 24 మంది అభ్యర్థులకు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 నోటీసులు అందుకున్న అభ్యర్థులు అందరూ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. అలాగే అందరి స్టేట్మెంట్లను హైకోర్టు రికార్డ్ చేయనుంది.

Next Story

Most Viewed