ఉరి వేసుకుని డైరెక్టర్ ఆత్మహత్య.. షాక్‌లో ఇండస్ట్రీ

by Mahesh |
ఉరి వేసుకుని డైరెక్టర్ ఆత్మహత్య.. షాక్‌లో ఇండస్ట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: డైరెక్టర్ ఉరి వేసుకొని ఆత్మ చేసుకున్న సంఘటన ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఈ ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే డైరెక్టర్ కొమరి జానయ్య(44) ఆదివారం హోటల్‌కు వెళ్లాడు. అయితే ఆయన సోమవారం రోజు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు కొట్టి చూశారు. ఎంత పిలిచిన తలుపు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గది తలుపులు ధ్వంసం చేసి చూడాగా అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గదిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన జీఎస్టీ అనే సినిమాతో పరిచయమయ్యాడు. కొమరి జానయ్య ఆత్మహత్య వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed