వైద్యశాఖ‌ చరిత్రలో రికార్డు.. బడ్జెట్‌ కేటాయింపుపై డీహెచ్ హర్షం

by Disha Web Desk 2 |
వైద్యశాఖ‌ చరిత్రలో రికార్డు.. బడ్జెట్‌ కేటాయింపుపై డీహెచ్ హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్య శాఖ‌కు రికార్డు స్థాయిలో రూ.12,161 కోట్ల బడ్జెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్​రావులకు డీహెచ్​డాక్టర్​శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాదితో పోల్చితే రూ.721 కోట్లు అధికంగా కేటాయింపులు జ‌రిగాయన్నారు. పెరిగిన బ‌డ్జెట్ కేటాయింపులు ఆరోగ్య తెలంగాణ సాధ‌న దిశ‌గా మ‌రింత దోహ‌దం చేస్తాయన్నారు. మంత్రి హరీష్​రావు ఆధ్వర్యంలో వైద్య రంగంలో మ‌రిన్ని విప్లమాత్మక మార్పులకు శ్రీ‌కారం చుట్టబోతున్నట్లు చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా జిల్లాకో నర్సింగ్ కాలేజీలు ప్రకటించడం సంతోషంగా ఉన్నదన్నారు.

దీని వలన గ్రామీణ వైద్య వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. గ‌ర్భిణుల్లో ఎనీమియా నివార‌ణ‌కు 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ల ప‌థ‌కాన్ని రాష్ట్రమంతటా విస్తరింపచేయడం గొప్ప విష‌మన్నారు. ప్రతీ ఏటా సుమారు 4 లక్షల మంది గర్భిణులకు ఇది వరం కానున్నదన్నారు. ప్రస్తుతం ఉన్న 350 బస్తీ దవాఖనలకు అదనంగా మరో 100 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఎంతో మంది పట్టణ బస్తీ ప్రజలకు వైద్య మరింత చేరువ కానున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహంతో వైద్యారోగ్యశాఖను మరింత బలోపేతం చేస్తామని డీహెచ్ స్పస్టం చేశారు.



Next Story

Most Viewed