నిఖత్‌ జరీన్‌ను అభినందించిన డీజీపీ, CS

by GSrikanth |
నిఖత్‌ జరీన్‌ను అభినందించిన డీజీపీ, CS
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. బీఆర్కేఆర్ భవన్‌లో నిఖత్ జరీన్ గురువారం మర్యాదపూర్వకంగా వారిని కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్‌గా నిఖత్ జరీన్ యువతకు ఆదర్శంగా నిలిచిందని శాంతికుమారి, అంజనీకుమార్ అన్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ సీఎస్ సందీప్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ పాల్గొన్నారు.

Next Story