పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు..

by Disha Web |
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు..
X

దిశ, వెబ్‌డెస్స్: సూర్యపేట జిల్లాలోని పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల జాతరకు భక్తుల పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు పెద్దగట్టుకు తరలి వస్తుండటంతో గుట్ట పరిసర ప్రాంతాలు మొత్తం "ఒ లింగ" నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని యాదవుల కొంగుబంగారంగా కొలిచే లింగమంతుల స్వామి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఈ జాతర కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్బంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నారు. తెలంగాణలో మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతర కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1850 మంది పోలీసులు, 60 ప్రత్యేక సీసీ కెమెరాలతో పాటు.. డ్రోన్ కెమెరాలతో పటిష్టంగా పోలీసులు భద్రత నిర్వహిస్తున్నారు.Next Story