- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక పాలసీ అంటూ లేదు: డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా జరిగిన కార్యక్రమంలో కొత్త ఎంస్ఎంఈ (MSME) పాలసీ-2024ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక పాలసీ అంటూ లేదని.. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయాలని.. ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలు చాలా కీలకం అని అన్నారు. అలాగే ఎంఎస్‌ఎంఈలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందదని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచనకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పాలసీ తెచ్చారని.. భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.