ధాన్యం కొనుగోలు రాష్ట్రానిదే.. ఈ నెల 10 వరకు డెడ్ లైన్

by Disha Web Desk 4 |
ధాన్యం కొనుగోలు రాష్ట్రానిదే.. ఈ నెల 10 వరకు డెడ్ లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలు చేయాల్సింది రాష్ట్రమేనని.. దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలంగాణ రైతు జేఏసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు గురువారం 'తెలంగాణలో వడ్ల సేకరణ - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి - పరిష్కారం' తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించి, తెచ్చే మొత్తం ధాన్యాన్ని ఎంఎస్‌పితో కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 10 నాటికి అన్ని గ్రామాల్లో ఐకేపీ లేదా రైతు సహకార సంఘాలు, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో సేకరణ కేంద్రాలు ప్రారంభించాలని తెలంగాణ రైతు జేఏసీ డిమాండ్ చేసింది. ముడి బియ్యం పట్టినప్పుడు వచ్చే నూకలకు కొంత విలువ ఉంటుందని, క్వింటాలుకు 50 కిలోలు మాత్రమే ముడిబియ్యం వచ్చే అవకాశం ఉంటుందని, ఎఫ్‌సిఐ మార్గదర్శకాలను సవరించుకుని, ప్రతి క్వింటాలు ధాన్యం నుంచి బియ్యం లేవని ఈ ప్రత్యేక సంవత్సరానికి తీసుకురావచ్చన్నారు.

అదనపు నూకల వల్ల రైస్ మిల్లు యజమానులకు జరిగే నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలన్నారు. కేంద్రం నష్ట్రం భరించడానికి ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నష్టాన్ని మొత్తం భరించాలని తెలంగాణ రైతు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు వడ్లు ఎవరికి అమ్మలో తెలియక అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మాత్రం ధాన్యం విషయంలో రాజకీయం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని, ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వారికి అమ్ముకునేట్టు కుట్ర జరుగుతుందన్నారు. రైతు కేవలం వడ్లు మాత్రమే ఇస్తారని, పారాబాయిల్డ్, ముడిబియ్యం అనేది ప్రభుత్వాల బాధ్యతని, ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, లేకపోతే అన్ని జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల9న రాష్ట్ర సీఎస్, గవర్నర్‌కి ఈ వడ్ల కొనుగోలు విషయంపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంఎస్‌పీలో 23 పంటల్లో ప్రధానమైనది వరి అని అన్నారు. ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసిందే కరువు నుంచి పేదలను కాపాడి బియ్యం పంపిణి పెట్టిందన్నారు. ఎఫ్‌సిఐకి లాభానష్ట్రాలతో సంబంధం లేదని, ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేయడాని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఎంఎస్‌పి ధరలు శాస్త్రీయంగా లేవన్నారు. ధాన్యం సేకరణ దేశం మొత్తం ఒకే విధంగా ఉందని, పంజాబ్, హర్యానాలో ఒకలా లేవన్నారు. ఉప్పుడు బియ్యం అనేది రైతులకు సంబంధం లేని విషయమన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు కూడా రైతులకు తెలుసని, రైతులకు ప్రభుత్వాలు స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. వారికి ఏ కాలంలో ఏ పంట వేయాలో బాగా తెలుసన్నారు. ఐకేపీ, సివిల్ సప్లై, కోపరేట్ సొసైటీ వారికి రైస్ మిల్లర్లతో లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed