హైదరాబాద్‌ నుంచి కర్ణాటకకు రోజూ RTC లగ్జరీ బస్ సర్వీస్

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌ నుంచి కర్ణాటకకు రోజూ RTC లగ్జరీ బస్ సర్వీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటకలోని దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సిందనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్లనుంది. దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. మియాపూర్‌ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్‌ నుంచి రూ. 840 చార్జీగా సంస్థ నిర్ణయించింది. దావణగెరె సర్వీస్‌ శుక్రవారం నుంచే ప్రారంభమైంది.

టికెట్‌ బుకింగ్‌ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆర్టీసీ పేర్కొన్నది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం ఈ కొత్త సర్వీస్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనా ర్​మాట్లాడుతూ.. ''మధ్య కర్ణాటకలోని దావణగెరెకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిమాండ్‌ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను ఏర్పాటు చేశాం. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకుని ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి." అని సూచించారు. ప్రస్తుతం కర్నాటకలోని బెంగళూరు, రాయచూర్‌, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసులకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుండటం శుభసూచికమన్నారు.

Next Story

Most Viewed