- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక్క క్లిక్... ఖాతా ఖాళీ

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ క్రైమ్ నేరాల ద్వారా 2024లో దేశ వ్యాప్తంగా రూ. 22,812 కోట్లు నష్టపోయినట్లు అంచనా అని, గత ఏడాది తెలంగాణలో 1,20,869 మంది పౌరులు సైబర్ క్రైమ్‌ల బారిన పడ్డారని సైబర్ క్రైమ్ నివేదికలు తెలుపుతున్నాయి. రాష్ట్రావ్యాప్తంగా సైబర్ క్రైమ్ 2024 నివేదికల ప్రకారం రూ1869కోట్లు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. రోజుకో రకంగా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్ మోసాలకు చాలా మంది బలవుతున్నారు. ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీలవుతున్నాయి. ఫైల్స్ ఓపెన్ చేసి సైబర్ క్రైమ్‌కి కొందరు గురైతే మరి కొందరు.. వాట్సప్‌లలో వచ్చిన ట్రేడింగ్ మేసేజ్‌లను క్లిక్ చేసి దగా పడుతున్నారు.
సైబర్ మోసాలలో భారత్ స్థానం 10
వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ సూచిలో సైబర్ నేరాలలో భారత్ 10వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో రష్యా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా ఉన్నాయి. ఉత్తర కొరియా ఏడవ స్థానంలో ఉండగా, యూకె , బ్రెజిల్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.సైబర్ క్రైమ్ కేటగిరీ కింద టాప్ టెన్ దేశాల్లో మొదటి ఆరు దేశాలు ఒక మోస్తారు స్థాయి సైబర్ క్రైమ్ రకాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
సైబర్ నేరాల తీరు
ట్రేడింగ్ లో ఎక్సపర్ట్స్ అంటు అన్లైన్ ద్వారా పరిచయం చేసుకుంటారు. కోట్లలో లాభాలంటు కళ్లేదుటే చేపిస్తారు. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయిస్తారు. విత్ డ్రా సమయానికి మయవుతారు.
సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్లు చేస్తారు. మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ మిమ్మల్ని బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ వీడియోకాల్స్ ద్వారా పూర్తిగా వారి ఆధీనంలోనే పెట్టుకుంటారు. భయపెట్టి, ఆందోళనకు గురి చేసి మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా వారి ఖాతాల్లోకి జమచేయించుకుంటారు.
కొరియర్, పార్సిల్ కార్యాలయాల నుంచి కాల్ చేస్తున్నామంటూ పరిచయం చేసుకుంటారు. మీ పేరిట వచ్చిన పార్సిళ్లలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయని, దీనిపై కేసు నమోదైందని భయపెడతారు. దాన్నుంచి తప్పించాలంటే తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు వేయాలని బెదిరిస్తారు.
మేం ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి. లేకపోతే బ్లాక్ అయిపోతాయి. అని చెబుతూ.. సీవీవీ నంబరు, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు.
సైబర్ క్రైమ్ కేసులు దేశ వ్యాప్తంగా 2024లో ప్రతిరోజూ 6,175కి పైగా నమోదయ్యాయంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ మోసాలు భారీగా 2019 నుంచి 87 రెట్లు పెరిగాయని ప్రభుత్వం నిఘా వర్గాలు హెచ్చరికలుచేస్తున్నాయి. కంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి పనిచేస్తున్న సైబర్ నేరస్థులు భారత్‌ని టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, ఎన్ని అవగాన కార్యాక్రమాలు నిర్వహించిన మోసాలపై వార్తలు వచ్చినా కొందరూ మెసానికి గురవుతూనే ఉన్నారు. స్మార్ట్ ఫోన్ లో అపరిచితులు పంపే మేసేజ్ అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమారపాటుతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. కొందరూ అత్యాశకు పోయి సైబర్ మోసాలతో కోట్లు పోగోట్టుకుంటున్నవారు ఉన్నారు.
రూ.800కోట్ల లాభం చూపించి రూ.11కోట్లు కొట్టేశారు. ట్రెడింగ్ లో ఇన్వస్ట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి రూ.800కోట్ల లాభం చూపించి రూ.11 కోట్లు కోట్టేసినట్లు బాధిత వ్యక్తి చెప్పుకోచ్చాడు.
హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.11.11కోట్లు 34 విడతలలో కొట్టేశారు. విడతలలో ట్రేడింగ్ లాభాలంటూ ఆశ చూపి దోచుకున్నారు. గత ఆగస్టు నెలలో మిత్తల్ అనే వ్యక్తి ట్రెడింగ్ బిజీనెస్ పేరుతో వాట్స్అప్ లింక్ పంపించాడు. ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేయడం అధిక లాభాలు వస్తాయని తెలపడంతో డాక్టరం ఇన్వెస్ట్ చేశాడు. 34 విడుతలుగా ట్రెడింగ్ లో ఇన్వస్టు చేస్తు వచ్చాడు. దాదాపు నాలుగు నెలల పాటు ఆగస్టు, సెప్టెంబర్ , అక్టోబర్ నవబంర్ వరకు ఇన్వస్ట్ సాగింది. మీరు ఇన్వస్ట్ చూసిన షేర్స్ రూ.800కోట్లు లాభం వచ్చినట్లు చూపించారు. డిసెంబర్ నెలలో విత్ డ్రా చేసుకునేందుకు డాక్టర్ ప్రయత్నించగా అతనికి సాధ్యపడలేదు. ఇన్వస్ట్ చేయించిన వారిని సమాధానం కోరగా మరికొంత మొత్తం చెల్లించాలని తెలపడంతో మోసపోయనని గ్రహించాడు. డిసెంబర్ నెలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరోకి ఫిర్యాదు చేశాడు.
ట్రేడింగ్ పేరుతో రూ. 2.95 కోట్లు
ట్రేడింగ్‌లో లాభాలంటూ ఓ వ్యక్తిని మార్వల్ క్యాపిటా అనే స్టాక్ మార్కెట్ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. రూ. 2.95కోట్టు పెట్టుబడి పెట్టించారు. అధిక లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. వాటిని విత్‌డ్రా చేసేందుకు వీలు కాక పోవడంతో బాధిత వ్యక్తి వారిని సంప్రదించగా కాంటాక్టు కట్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో కర్నాటక కు చెందిన ఇద్దరూ వ్యక్తునలు టీజీసీఎస్బీ అరెస్ట్ చేసింది. మరో ఇద్దరూ నిందితులు దుబాయిలో ఉన్నట్లు గుర్తించారు.
డెంటిస్టు నుంచి రూ.1.25కోట్లు స్వాహా..
హైదరాబాద్ కు చెందిన ఓ డెంటిస్టు ను పటేట్ అకాడమీ అనే వాట్సప్ గ్రూప్ లో చెర్చారు. షేర్ల ట్రేడింగ్లో తాము నిపుణులమని పెట్టుబడిదారులకు మెలకువలు నేర్పించి భారీగా లాభాలొచ్చేలా సలహాలిస్తామని చెప్పారు. వచ్చే లాభాల్లో 15-30శాతం వాటా తీసుకుంటామని తెలిపారు.. జిగ్లెన్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డెంటిస్ట్ నెల రోజుల్లోపు 15 విడతల్లో రూ.1.25 కోట్లను ఆరు బ్యాంకు ఖాతాల్లోకి పంపించారు. ఆ తర్వాత వాట్సప్ గ్రూప్ నుంచి ఆ డెంటిస్ట్ నంబరును తొలగించారు. అంతక్రితం మాట్లాడిన వారి ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం మానేశాయి. దాంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేశారు.
60 ఏళ్ల రిటెర్ట్ ఉద్యోగికి ఎపికే ఫైల్ పంపి రూ.1.90కోట్లు దన్నుకున్నారు- నిందితురాలు ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండెట్ మహిళ
హైబారాబాద్ నగరానికి చెందిన రిటెర్డ్ ఉద్యోగి ఫోన్ కు ఏపీకే ఫైల్ రాగా దానిని క్లిక్ చేశారు. ఫోన్‌ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. బాధితుడి ఖాతా నుంచి దశలవారీగా రూ. 1.90 కోట్లు కాజేశారు. భాదితుడు వెంటనే సైబర్ క్రైమ్ ను ఆశ్రయించాడు. విచారణలో ఆ డబ్బంతా ఓ ఎన్జీవోకు కరెంట్ ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ ఖాతాను యూపి రాష్ర్టానికి చెందినది గుర్తించి ఫ్రీజ్ చేసి డబ్బు మొత్తం నిలిపివేశారు. ప్రత్యేక టీమ్ యూపీకి వెళ్లి నిందితులను అరెస్టు చేసింది. ప్రధాన నిందితురాలు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 60 ఏళ్ల కమలేష్ కుమారి గా గుర్తించారు. యూపీలో ఒక ప్రధాన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారానికి చేసిన అప్పులు తీర్చడానికి సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడింది.
8 రోజులు డిజీటల్ అరెస్ట్ రూ.34లక్షలు కాజేశారు
డీహెచ్ కొరియర్‌లో మీ పేరుతో డ్రగ్స్,చట్ట వ్యతిరేకమైన ఉత్పత్తులు పంపుతున్నట్లు పార్శిల్ దొరికిందని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. స్కైప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి వీడియోకాల్‌లో ముంబై క్రైమ్ పోలీసుల్లా నమ్మించారు. 8 రోజులు డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కేసు నుంచి బయటపడాలంటే మీ ఖాతాలో ఉన్న డబ్బు ఆర్‌బీఐ ఖాతాకు బదిలీ చేయాలని, అక్రమ లావాదేవీలు జరగలేదని, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు లేవని తేలితే డబ్బును మీ ఖాతాకు బదిలీ చేస్తామని నమ్మించారు. బాధితుడికి వివిధ ఖాతాల్లో ఉన్న రూ. 34లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక టీమ్ గుజరాత్‌కు చెందిన బరియా సంజీవ్‌కుమార్, ఖాళీ రోహిత్‌కుమార్‌ను అరెస్టు చేసింది. వీరు దుబాయ్‌లో ఉంటున్న ప్రధాన సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ మోసాలకు పాల్పడుతుంటరని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళ నుంచి రూ.5.66కోట్లు దోచేశారు
మీ మొబైల్ నెంబర్ పలు ఆర్ధిక నేరాలలో నమోదై ఉన్నాయని, మనీ లాండరీంగ్ కేసులో మిమ్మల్ని డిజీటల్ అరెస్టు చేస్తున్నాం అంటూ హైదరాబాద్ నగరంలోని ఓ మహిళను, ఆమె ఇద్దరు కుమర్తెలను సైబర్ నెరగాళ్లు డిసెంబర్ నెలలో బెదింరించారు. పోలీసు అధికారులం అంటూ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో వీడియోకాల్ చేసి మాట్లాడారు. మీ అకౌంట్ లో అమౌంట్ సీజ్ చేయాలని తెలిపారు. వారు చెప్పిన అకౌంట్ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. విచారణ పూర్తయిన అనంతరం అమౌంట్ రిటర్న్ చేయబడుతుందని చెప్పి ఉన్నదంతా ఉడ్చేశారు. రెండు రోజుల తర్వాత బాధితులు సైబర్ నేరగాళ్ళకు కాల్ చేయగా దగ్గరలో ఉన్న సీబీఐ శాఖను సంప్రదించాలని చెప్పారు. అనంతంర ఫోన్ నెంబర్ కలవకుండా చేశారు. భాదిత మహిళ సీబీఐ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకోగా సైబర్ క్రైమ్ ద్వారా తాను మోసపోయానని గ్రహించింది. సైబర్ సెక్యూరిటీని ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
అనుమనాస్పద మేసేజ్, లింక్ లు ,ఓటిపి రాకుండా రూ.1.90కోటి కాజేశారు..
గోల్డెన్ ఆవర్‌లో రూ.1.10లక్షలు రికవరి
హైదరాబాద్ కు చెందిన వ్యాపారికి తన డిసెంబర్ 10 వతేదిన తన అకౌంట్ ఉన్న రూ.1.90కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు. తన ఫోన్ కు ఎటువంటి అనుమానాస్పద సందేశాలు, లింక్‌లు రాలేదని, ఓటీపీ లేకుండానే ఆ మొత్తం డెబిట్ అయింది. వెంటనే సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించారు. గోల్డెన్ హవర్లో ఫిర్యాదు చేయడంతో కోల్పోయిన రూ. 1.10కోట్లు టీజీసీఎస్బీ రికవరీ చేసింది. అప్పటికే నేరగాళ్ళు డబ్బులను పలు ఖాతాకు మార్చడంతతో రూ.80లక్షలు బాధితుడు కొల్పోవలసి వచ్చింది. కేసు ప్రోగ్రస్ ఉందని టీజీసీఎస్బీ బాధితుడికి తెలిపింది.
వంద మంది నిందితుల జాబితా సిద్ధం ... 10వేల కేసులో నిందితులుగా గుర్తింపు..
తెలంగాణలో జరిగిన సైబర్ నేరాలకు, వాటిలో నిందితులు వాడిన ఫోన్ నంబర్‌లను ‘సైబర్ క్రైం ఎనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం (సైకాప్స్)’ద్వారా విశ్లేషించారు. 14,984 సిమ్‌కార్డులు, ఐఎంఈఐ నంబర్ల ద్వారా 9,811 ఫోన్లను బ్లాక్ చేశారు. ఈ వివరాల ఆధారంగా అత్యధికంగా నేరాలకు పాల్పడిన 100మంది ప్రొఫైల్స్‌ను సిద్ధం చేశారు. వీరు దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా నేరాలకు పాల్పడ్డట్లు ఆధారాలతోసహా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఆయా రాష్ట్రాలకు పంపించారు.
2024లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసుల వివరాలు
సైబర్ క్రైమ్ వివరాలు 2024 2023
మొత్తం నమోదైన కేసులు 1,14, 174 ..91,652
బాధితులు పోగుట్టుకున్న మొత్తం రూ. 1866.9 కోట్లు రూ.778.7కోట్లు
రిఫండ్ రూ.176.71కోట్లు రూ.8.36కోట్లు
హొల్డ్ చేసిన మొత్తం రూ.244.56కోట్లు రూ.127కోట్లు
రిఫండ్ పొందిన బాధితుల సంఖ్య 17,411 .. 1,830
ఎఫ్ఐఆర్ అయినవి 24,643 ..16,339