Cyber: హోం టూర్స్ చేస్తున్నారా? వేరీ డేంజర్.. తెలంగాణ పోలీస్ హెచ్చరిక

by Ramesh Goud |   ( Updated:2025-01-23 13:47:26.0  )
Cyber: హోం టూర్స్ చేస్తున్నారా? వేరీ డేంజర్.. తెలంగాణ పోలీస్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అలాంటి పోస్టింగ్స్(Postings) చేస్తున్నారా అయితే వేరీ డెంజర్(Very DANGER) అని తెలంగాణ పోలీస్(Telangana Police) ట్వీట్ చేసింది. సైబర్ నేరాల(Cyber Crimes)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసులు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే బుధవారం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇందులో సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు(Personal Information) పోస్ట్ చేయొద్దు అని, ఊరెళ్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అని సూచించారు. అలాగే యూట్యూబ్(You Tube), ఇన్‌స్టా్గ్రామ్(Instagram) వ్యూస్(Views) కోసం హోం టూర్స్(Home Tours) చేయొద్దని, సోషల్ మీడియాలో ఇంటి అడ్రస్ బహిర్గతం చేయొద్దు అని తెలిపారు. దీనిపై సోషల్‌ మీడియాలో మీ వ్యక్తిగత వివరాలు పోస్ట్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని సలహా ఇచ్చారు. అంతేగాక వ్యూస్‌, లైక్స్‌ కోసం మీ రోజువారీ యాక్టివిటీని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయకండి.. అంతేగాక ఊరెళ్తున్నాం అంటూ పోస్టులు చేయడం వెరీ డేంజర్ అని తెలంగాణ పోలీస్ హెచ్చరించారు.

Advertisement

Next Story