వారిపై ఉక్కుపాదం మోపుతాం.. HYD సీపీ CV ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-09 05:05:07.0  )
వారిపై ఉక్కుపాదం మోపుతాం.. HYD సీపీ CV ఆనంద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామని సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. కాగా, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కు హైద‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు.

తెలంగాణ కేడ‌ర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదన‌పు డైరెక్టర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసుగా ప‌దోన్నతి పొందారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన ఆయ‌న 2021లో తిరిగి తెలంగాణ‌కు చేరుకున్నారు. 2023 ఆగ‌స్టులో డీజీపీ హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు మ‌ళ్లీ హైద‌రాబాద్ సీపీగా నియామ‌కమై బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story