CS Shanti Kumari : తీరొక్క పూలతో సచివాలయంలో బతుకమ్మ సంబురాలు!

by Ramesh N |   ( Updated:2024-10-08 15:33:15.0  )
CS Shanti Kumari : తీరొక్క పూలతో సచివాలయంలో బతుకమ్మ సంబురాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ వేడుకలలో సీఎస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఉద్యోగస్తులతో కలిసి బతుకమ్మ ఆడారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను సచివాలయ ప్రాంగణంలో నిర్వహించడంపై సీఎస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ బతుకమ్మ ఉత్సవాలు సచివాలయంలోని ఉన్నతాధికారుల నుంచి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో సంబరాలు చేశారు.

Advertisement

Next Story