హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆన్​లైన్​క్రికెట్​బెట్టింగ్​నిర్వహిస్తున్న గ్యాంగ్‌ను దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్​పోలీసులు శుక్రవారం అరెస్ట్​చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బర్కత్​పురాకు చెందిన వికాస్​అగర్వాల్​(40) గతంలో గుర్రప్పందాల బుకీగా పని చేసేవాడు. అయితే, చేస్తున్న పని నుంచి ఆశించినంత ఆదాయం రాకపోవటంతో ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాడు. వీటి నుంచి బయట పడటానికి ఆన్​లైన్​లో క్రికెట్​బెట్టింగ్​నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ముంబయికి చెందిన సాగర్​అనే వ్యక్తిని కలిసాడు. అతని వద్ద నుంచి వేరే దేశం ద్వారా నడుస్తున్న రాధే అనే వెబ్​అప్లికేషన్​ను అద్దెకు తీసుకున్నాడు. ఆ తరువాత గోషామహల్​లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అదే ప్రాంతానికి చెందిన మహేందర్​పటేల్​, రాజేందర్​పటేల్​ను తనతో చేర్చుకుని బెట్టింగులు నిర్వహించటం మొదలు పెట్టాడు. ఇటీవల జరిగిన ఇండియా‌‌...న్యూజీల్యాండ్​మూడో టీ 20 మ్యాచ్​పై కూడా బెట్టింగులు తీసుకున్నాడు. వీటికి సంబంధించిన డబ్బులు వసూలు చేస్తుండగా దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్​పోలీసులు, షా ఇనాయత్​గంజ్​పోలీస్​స్టేషన్​సిబ్బందితో కలిసి అరెస్ట్​చేశారు. నిందితుల నుంచి 12లక్షల నగదు, 4సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కంటి వెలుగు సిబ్బందిని అభినందించిన డీజీపీ

డీజీపీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించిన సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్​శుక్రవారం అభినందించారు. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డీహెచ్​ఎంవో డాక్టర్​వెంకట్​ఆధ్వర్యంలో 15మంది వైద్యుల బృందం గత నెల 25 నుంచి డీజీపీ కార్యాలయ సిబ్బందికి నేత్ర పరీక్షలు జరిపారు. మొత్తం 1152 మంది ఉద్యోగులకు పరీక్షలు జరిపి 515 మందికి రీడింగ్​గ్లాసులు, 326 మందికి రిఫరల్​కళ్లద్దాలను అందచేయనున్నట్టు శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో డాక్టర్​వెంకట్​చెప్పారు. ఈ క్రమంలోనే డీజీపీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ సంజయ్​కుమార్​జైన్​, డీఐజీ రమేశ్​రెడ్డి పాల్గొన్నారు.


Next Story