ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. CPI (ML) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా

by Dishafeatures2 |
ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. CPI (ML) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా
X

దిశ, వెబ్ డెస్క్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా ఆరోపించారు. రూ.2 లక్షల 90 వేల 396 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వాస్తవాల్ని మరుగునపరిచారని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ అంతా మేడిపండు చందంగా మారిందని, ఈ బడ్జెట్ తో అప్పులు రెట్టింపు అవుతాయే తప్ప మరే ప్రయోజనం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ మాటలు తీరుగానే ఆర్థిక మంత్రి హరీష్ రావు అంకెల గారడీ చేశారని విమర్శించారు. పలు స్కీంల కింద బడ్జెట్ ఇంత అని చూపించినా ఖర్చు చేసేది మాత్రం ఏముండదని ఫైర్ అయ్యారు. ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా హరీష్ రావు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారే తప్ప మరేమీ లేదని విమర్శించారు. గత 8 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్న రమేష్ రాజా.. ఈ బడ్జెట్ తో ఇంకేదో అద్భుతాలు చేస్తారనుకోవడం వట్టి భ్రమే అవుతుందని అన్నారు.


Next Story

Most Viewed