'పేదలకు విద్యను దూరం చేయడమే కేంద్రం లక్ష్యమా..?'

by Disha Web Desk 13 |
పేదలకు విద్యను దూరం చేయడమే కేంద్రం లక్ష్యమా..?
X

దిశ, తెంలంగాణ బ్యూరో: దేశంలో విద్యార్థుల ప్రిమెట్రిక్‌ ఉపకారవేతనాలను వెంటనే పునరుద్దరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న ప్రిమెట్రిక్‌ ఉపకారవేతనాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేశారని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్య అందిస్తున్నది కాబట్టి స్కాలర్‌షిఫ్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పుతున్న వాదన అర్థరహితమన్నారు. ఈ స్కాలర్‌ షిప్‌లను రద్దు చేయడం వలన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, డ్రాప్‌ అవుట్స్‌ పెరిగే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న పథకాన్ని కుదించాల్సిన అవసరమేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. వెంటనే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్న బడుగు బలహీనవర్గాల పిల్లలకు వెంటనే ప్రిమెట్రిక్‌ ఉపకారవేతనాలు పునరుద్దరించాలని కూనంనేని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.


Next Story

Most Viewed