ఎన్నికల ప్రణాళిక 2023 ను విడుదల చేసిన సిపిఐ

by Disha Web Desk 12 |
ఎన్నికల ప్రణాళిక 2023 ను విడుదల చేసిన సిపిఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంగా సిపిఐ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023 ను ఆ పార్టీ నేతలు బుధవారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె . నారాయణ మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ నాటి ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో దుబారా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేసిందని అభివృద్ధి పేరిట విచ్చల విడిగా అప్పులు చేసిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ గా వున్నా ఈ రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్ గా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు గడిచిన తొమ్మిదేళ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఈ అప్పు తీరాలంటే 30 -40 ఏళ్ళు పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని పేద మధ్యతరగతికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట చరిత్రను అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తామని అన్నారు. భూమి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. విద్యా, వైద్యంతో పాటు విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల సబ్సిడీ ఎంఎస్పి ధరలను ఇస్తామన్నారు. వ్యవసాయ కార్మికులకు సాగుభూమిని పంపిణీ చేస్తామని తెలిపారు. కార్మికులకు కావాల్సిన సదుపాయాలు కల్పించి కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్నారు.

దళితులకు ప్రభుత్వ నిధులతో సొంత ఇల్లు కాలనీలో కట్టిస్తామన్నారు. కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించే వారికి రక్షణ కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులకు బడ్జెట్ లో విద్యారంగానికి 33 శాతం నిధులు కేటాయిస్తామన్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేస్తామని పేర్కొన్నారు. గిరిజనులకు ప్రమోషన్లు పెంచిన 10% రిజర్వేషన్లు కేంద్ర చట్టబద్ధ కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు.

బీసీలకు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో వారి సంక్షేమం కోసం బీపీ మండల్ కమిషన్ సిఫారసులను పూర్తి చేస్తామన్నారు. చేనేత కార్మికులకు ఆ రంగాన్ని పరిరక్షణ కోసం స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తామని సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేస్తామన్నారు న్యాయవాదులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చట్టాన్ని తీస్తామని వారి సంక్షేమం కోసం తగిన నిధులు కేటాయిస్తుమని తెలిపారు. గీతా కార్మికులకు వెయ్యి గజాల భూమి కేటాయిస్తామన్నారు.

కళాకారులకు సాంస్కృతిక విధానం అమలు చేస్తామని , క్రీడారంగాన్ని ఇస్తున్న ప్రాధాన్యతను సంస్కృతి రంగానికి కూడా ఇస్తామన్నారు. బడ్జెట్లో సంస్కృతి రంగానికి 500 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తులకు అరికట్టి మతసామరస్యాన్ని సహనశీలతను పెంచుతామన్నారు. సమాజంలో శాంతియుతమైన వాతావరణం కల్పించుటకు కృషి చేస్తామని తెలిపారు.


Next Story

Most Viewed