ఎల్లా హోటల్‌లో రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు భేటీ

by Disha Web Desk 2 |
ఎల్లా హోటల్‌లో రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ఉండటంతో ఎటూ తేల్చలేక అధిష్టానం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో సీఎం ఎంపిక అయినట్లు తెలుస్తోంది. సీల్డ్ కవర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి పేరును కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

అనంతరం సీఎల్పీ నేతనూ ఫైనల్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైన ఎల్లా హోటల్‌కు సీపీఐ నేతలు చేరుకున్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడా వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం.

Next Story

Most Viewed