రాష్ట్ర బడ్జెట్‌పై సీపీఐ నేత కూనంనేని పాజిటివ్ కామెంట్స్

by Disha Web Desk 2 |
రాష్ట్ర బడ్జెట్‌పై సీపీఐ నేత కూనంనేని పాజిటివ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని బీజేపీ యేతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ప్రగతిశీల బడ్జెట్‌ అని, బడ్జెట్‌ అమలులో ప్రభుత్వం విఫలమైతే వ్యతిరేక బడ్జెట్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర బడ్జెట్‌పై కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను పూర్తిగా అమలు చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, గిరిజనులకు గిరిజన బంధు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 80 వేల ఉద్యోగాల ఖాళీలను పూర్తి చేయడం సంతోషమే, కానీ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.

నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వ్యక్తి కేంద్రీకరణగా నిధులు కేటాయించాలని సూచించారు. ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన మూడు లక్షలు సరిపోవని, 5 లక్షల రూపాయలు కేటాయించాలని సూచించారు. పేదలకు నేరుగా ఆర్థిక సహాయం అందించే క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌ లాంటివి చేయాలన్నారు. యూనివర్శిటీలకు కేటాయించిన నిధులు సరిపోవని, ఇంకా పెంచాలని కోరారు. వ్యవసాయ రంగంలో పంటల భీమాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఇంకా ఏవైన పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నవారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed