BREAKING: బెంగళూరులో భారీ బ్లాస్టింగ్.. హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించిన సీపీ

by Satheesh |
BREAKING: బెంగళూరులో భారీ బ్లాస్టింగ్.. హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించిన సీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో ఇవాళ భారీ బ్లాస్టింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేఫ్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగును వదిలి వెళ్లిన తర్వాత బ్లాస్ట్ జరిగినట్లు గుర్తించారు. రామేశ్వరం కేఫ్‌లో జరిగింది బాంబు పేలుడేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో కేఫ్‌లో బ్యాగు వదిలిన వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా.. బెంగళూరులో భారీ బ్లాస్ట్‌ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించినట్లు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలు, జనం రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో బ్లాస్టింగ్‌కు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed