పది పరీక్షల చివరి రోజు ప్రేమ జంటలకు కౌన్సిలింగ్!

by Disha Web |
పది పరీక్షల చివరి రోజు ప్రేమ జంటలకు కౌన్సిలింగ్!
X

దిశ,తుంగతుర్తి: పదవ తరగతి పరీక్షల చివరి రోజైన శనివారం నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో చిత్రవిచిత్రమైన సంఘటనలు నెలకొన్నాయి. చూసేవారికి, విన్నవారికి ఈ సంఘటనలు వింతను కలిగిస్తే పోలీసులకు మాత్రం విస్మయాన్ని కలిగించాయి. తుంగతుర్తి లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 4 సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్ పోలీస్ స్టేష పక్కనే ఉండగా మిగతా మూడు సెంటర్లు పట్టణానికి దూరంగానే ఉన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొంతమంది మైనర్లు తాము ప్రేమించే మైనర్ బాలికలను ద్విచక్రవాహనాలపై పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకొచ్చి పరీక్ష అనంతరం తీసుకెళ్లడం లాంటివి జరుగుతున్నాయి.

అయితే చివరి రోజు పరీక్ష రాసిన కొందరు మైనర్ విద్యార్థినిలు పురుషుల బైకులపై వెళ్తున్న తీరును గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇందులో రెండు, మూడు జంటలు ఏకంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నట్లు తెలిసింది. వీరిని పట్టుకున్న పోలీసులు సీరియస్‌గా కౌన్సిలింగ్ ఇచ్చి తమ తమ ఇండ్లకు పంపినట్లు తెలిసింది. ఇక మరికొందరిని ఆపి ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తాము పంపిస్తేనే తమ పిల్లవాడు పరీక్ష కేంద్రానికి తమ అమ్మాయిని తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై వచ్చాడనే సమాచారాన్ని నివృత్తి చేసుకొని పంపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తున్న వారికి విస్తూ గొలిపాయి. ఈ విషయమై ఎస్ఐ డానియల్ కుమార్ "దిశ"తో మాట్లాడుతూ తెలిసీ తెలియని వయసులో పిల్లలు ప్రేమలో పడడం భవిష్యత్తుకు ఇబ్బందికరమని పేర్కొంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలిపారు.

Next Story