పాతబస్తీలో కార్పొరేటర్ అల్లుడు దారుణ హత్య

by Disha Web Desk 11 |
పాతబస్తీలో కార్పొరేటర్ అల్లుడు దారుణ హత్య
X

దిశ, చార్మినార్​: ఓ ఇంటి స్థల విషయంలో తలెత్తిన వివాదంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మజ్లిస్​కార్యాయంలోకి చొరబడి కార్పొరేటర్​అల్లుడిని కత్తులతో అతి కిరాతకంగా హత్యచేసిన ఘటన పాతబస్తీ భవానీనగర్​ పోలీస్​స్టేషన్​పరిధిలో తీవ్ర కలకలం రేపింది. మజ్లిస్​ కార్పొరేటర్​ అల్లుడిని హతమార్చిన ఘటనలో భవానీనగర్​ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వివరాలలోకి వెళితే... పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితాబాగ్​ 36వ డివిజన్​ కార్పొరేటర్​ మొహమ్మద్​ ఆలీ షరీఫ్​ (ఆజం) రియాసత్​నగర్​లో మజ్లిస్​ పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నాడు. కార్పొరేటర్​ అల్లుడు సయ్యద్​ ముర్తూజా అనాస్​ (21) అన్వరులాం కాలేజ్ లో ఇంటర్​ విద్యార్థి. సోమవారం సాయంత్రం మామ కార్పొరేటర్​ మొహమ్మద్​ ఆలీ షరీఫ్​కు చెందిన మజ్లిస్​ కార్యాలయంకు అనాస్​ చేరుకున్నాడు. కాసేపటికే బైక్​ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంట తెచ్చుకున్న కత్తులతో అతి కిరాతకంగా దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో కార్పొరేటర్​ అల్లుడు సయ్యద్​ ముర్తూజా అనాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. కార్పొరేటర్​ కార్యాలయంలో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న భవానీ నగర్​ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో కుప్పుకూలిన సయ్యద్​ ముర్తూజా అనాస్ ను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనాస్​ పరిస్థితి విషమించడంతో కాసేపటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సౌత్​జోన్​ డీసీపీ సాయిచైతన్య, అడిషనల్​ డీసీపీ ఆనంద్​లు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్​ టీం, జాగిలాలను రప్పించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సయ్యద్​ ముర్తూజా అనాస్ పై కత్తులతో దాడిచేసి హతమార్చిన ఇద్దరిని భవానీనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఒక ల్యాండ్​ సెటిల్​ మెంట్​ విషయంలో తాను చెప్పింది వినాల్సిందేనని వేదింపులు తీవ్రతరం చేయడం కారణంగానే అతన్ని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును భవానీనగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాతబస్తీ ఓవైసీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

దుండగుల దాడిలో తీవ్రగాయాలకు గురైన సయ్యద్​ముర్తూజా అనాస్​ను పోలీసులు చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సయ్యద్​ముర్తూజా అనాస్​పరిస్థితి విషయమించడంతో కాసేపటికే మృతి చెందాడు. పాతబస్తీలోని మొయిన్​బాగ్​లో లలితాబాగ్​డివిజన్​కార్పొరేటర్​మొహమ్మద్​ఆలీ షరీఫ్​కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో చొరబడి అతని అల్లుడు అనాస్​ను హతమార్చారన్న వార్త దావానంలా వ్యాపించడంతో కార్పొరేటర్​ అనుచరులు, బంధువులు, మజ్లిస్​కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఓవైసీకి చేరుకున్నారు. అక్కడ ఫొటోలు వీడియోలు తీస్తున్న ఇద్దరి ఫోన్​లను సైతం మజ్లిస్​ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఓవైసీ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పాతబస్తీలోని మొయిన్​బాగ్ తో పాటు ఓవైసీ ఆసుపత్రి వద్ద భారీ పోలీస్​బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లిలో బిజీ..

హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ఓవైసీ కూతురు వివాహం వేడుకల్లో బిజీలో ఉండగా పాతబస్తీ మొయిన్​బాగ్​లో కార్పొరేటర్ మజ్లిస్​కార్యాలయంపై దాడి జరగడం, కార్పొరేటర్​అల్లుడుని హతమార్చిన ఘటనపై ఓవైసీ బ్రదర్స్​సీరియస్​అయినట్లు సమాచారం. దాడి విషయమై పోలీసులను మజ్లిస్​పార్టీ అధినేతలు ఆరాతీస్తున్నట్లు సమాచారం.

READ MORE

డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదు.. రాజకీయం: MLA Raghunandan Rao



Next Story

Most Viewed