- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు మరింత చేరువగా సహకార బ్యాంకింగ్
by Taduka Kalyani |
రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

X
దిశ, నేలకొండపల్లి : రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలం చెరువు మాదారం డిసిసిబి బ్రాంచిని చెరువు మాదారం గ్రామంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సీపీ సునీల్ దత్‌లతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రైవేట్, కమర్షియల్ బ్యాంకులతో పోటీగా డీసీసీబీ శాఖలు ఆధునిక ఆర్థిక సేవలు అందిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం డీసీసీబీ రూ. 5 కోట్ల లాభాలను ఆర్జించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
Next Story






