రాజన్న ఆలయ గదుల్లో అపచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఉద్యోగులు

by Disha Web Desk |
రాజన్న ఆలయ గదుల్లో అపచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఉద్యోగులు
X

దిశ, కరీంనగర్: దక్షిణ కాశీగా బాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నా కట్టడి చేసేవారే లేకుండా పోయారు. తాజాగా శుక్రవారం ఆలయ వసతి గృహంలో కాంట్రాక్టు ఉద్యోగులు కొందరు మద్యం సేవిస్తూ పట్టుబడ్డ ఘటన కలకలం సృష్టిస్తోంది. లక్ష్మీగణపతి వసతి గృహ సముదాయంలోని రూం నెంబర్ 35ను అవసరాల నిమిత్తం అద్దెకు ఇవ్వకుండా అత్యవసర పరిస్థితుల కోసం ఉంచుతారు. అయితే ఇదే గదిని బారుగా మార్చి కాంట్రాక్టు ఉద్యోగులు మద్యం సేవిస్తుండగా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై ఈవో రమాదేవి విచారణ జరుపుతున్నామని ప్రకటించారు.


Next Story