తీవ్రనేరాలకు పాల్పడిన నేతల పోటీ.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా విధించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ఆదేశించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్‌పై గురువారం సీజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసి విచారించాలని హైకోర్టులకు ఆదేశించింది. అలాగే కేసుల వివరాలు, విచారణ అంశాల కోసం వెబ్ సైట్ రూపొందించాలని పేర్కొంది. దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ అంశంపై విచారణ జరుపుతామని తెలిపింది.

Next Story