ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనియ్యం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Dishafeatures2 |
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనియ్యం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనీయమని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎదురుగాలి మొదలైందని, కాంగ్రెస్ హవా షురూ అయ్యిందని అన్నారు. కాగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్యర్యంలో జనగర్జన సభను నిర్వహించునున్నారు.

ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు రాహుల్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. తమ సభను అడ్డుకోవడానికి అధికార బీఆర్ఎస్ పార్టీ సర్వ విధాలుగా ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Next Story