బీజేపీ పెద్దలను కలుస్తూనే ఉంటా.. ఏం చేస్తారో చేసుకోండి: కాంగ్రెస్ ఎంపీ

by Disha Web Desk 2 |
బీజేపీ పెద్దలను కలుస్తూనే ఉంటా.. ఏం చేస్తారో చేసుకోండి: కాంగ్రెస్ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసులపై పాటియాల కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు తారిఖ్ అన్వర్ పేరుతో తనకు వచ్చిన షోకాజ్ నోటీసులపై సోమవారం ఆమె సెటైర్లు వేశారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని వీడిన వ్యక్తి ఇవాళ నన్ను క్రమశిక్షణ విషయంలో ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. 1999 నుంచి 2019 వరకు పార్టీ క్రమశిక్షణ చర్యను ఎదుర్కొన్న తారిఖ్ అన్వర్ తనకు షోకాజ్ నోటీసులు పంపించడం ఆశ్చర్యపోయానని అన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ప్రణీత్ కౌర్‌ను ఏఐసీసీ పార్టీ నుంచి రెండు రోజుల క్రితం బహిష్కరించింది. అలాగే పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పంజాబ్ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుతో అధిష్టానం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ నేపథ్యంలో రియాక్ట్ అయిన తన నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వ పెద్దలతో కలుస్తూనే ఉంటానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను కలుస్తుండటం సాధారణమైన విషయమే అనేది మీకు తెలుసని నేను ఆశిస్తున్నానన్నారు. తాను కూడా తన నియోజకవర్గానికి చెందిన పనుల నిమిత్తం కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వెళ్లి కలుస్తానన్నారు. ఈ విషయంలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమస్యల పరిష్కారం కోసం నేను కూడా రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ కలుస్తూనే ఉంటానని ఒకవేళ నాపై చర్య తీసుకోవాలంటే మీరు ఎలాంటి చర్యకైనా తాను సిద్ధం అన్నారు.



Next Story

Most Viewed