కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి వృథా: కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Anjali |
Mallu Ravi
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని గతంలో డివిజన్ హామీ ఇచ్చిదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు హోదా ఇవ్వమని అడగటంలో అర్థం ఉండదని తెలిపారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి వృథా అవుతుందని పేర్కొన్నారు. అందుకే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నామని వెల్లడించారు. గతంలో కూడా మల్లు రవి బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ ఒప్పుకుని కాళేశ్వరం విజిట్ చేయడం వెంటనే ఆపాలని సంచలన కామెంట్స్ చేశారు. అసలు కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో జనాలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రంలో కాళేశ్వంలో జరిగిన తప్పులను, వాస్తవాలను ప్రజల ముందు ఉంచామన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జరిగింది చిన్న పొరపాటు కాదని మండిపడ్డారు. కాళేశ్వరం కట్టి నష్టపరిస్తే.. పాలమూరు రంగారెడ్డిని కట్టకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని మల్లు రవి విమర్శులు గుప్పించారు.

Next Story