పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని పిలవరా..? కాంగ్రెస్

by Disha Web Desk 19 |
పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని పిలవరా..? కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని పిలవకుండా బీజేపీ సర్కార్ అవమానపరుస్తుందని ఆదివాసీ కాంగ్రెస్ ​చైర్మన్ ​బెల్లయ్య నాయక్​పేర్కొన్నారు. దీంతో 28న నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా ప్రధాని చేత ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మొదటి వ్యక్తిని పిలవకుండా, ప్రోటోకాల్‌లో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తి పీఎం చేతులు మీదుగా ప్రారంభించడం సరికాదన్నారు. గిరిజన మహిళను అవమానించడం సరికాదన్నారు. దీంతోనే 28న ఉదయం గాంధీ భవన్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టి, అనంతరం నెక్లేస్ రోడ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందజేస్తామన్నారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ ఎంపీలు బహిష్కరిస్తున్నామన్నారు. మోదీ భారత రాజ్యాంగాన్ని అవమనపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఇక నుండి ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ మీటింగ్ ఉంటుందన్నారు. జూన్ 2న సోనియా గాంధీకి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఇరవై రోజుల పాటు కాంగ్రెస్ శ్రేణుల ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. పీసీసీ మాజీ చీఫ్​ వీహెచ్​ మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు నిజాంకి వ్యతిరేకం అంటూనే జెండా అక్కడే ఎగరేస్తారన్నారు. కేసీఆర్‌కు చెక్​పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.


Next Story

Most Viewed