చంద్రబాబు అరెస్ట్ వెనక తెలంగాణ సీఎం కేసీఆర్: మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
చంద్రబాబు అరెస్ట్ వెనక తెలంగాణ సీఎం కేసీఆర్: మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనక కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనక ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారనే చంద్రబాబుపై ప్రధాని మోడీ కక్ష కట్టారని ఆరోపించారు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు.. ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

Next Story