‘మీ ఇళ్లపై ఎవరూ చేయి వేయరు’.. మూసీ బాధితులకు మధుయాష్కీ భరోసా

by Gantepaka Srikanth |
‘మీ ఇళ్లపై ఎవరూ చేయి వేయరు’.. మూసీ బాధితులకు మధుయాష్కీ భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ బాధితులకు కాంగ్రెస్(Congress) నేత మధుయాష్కీ గౌడ్(Madhu Yaskhi Goud) భరోసా ఇచ్చారు. మంగళవారం మూసీ పరివాహక ప్రాంతాల్లో(Musi catchment area) పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘మీ ఇళ్లపై ఎవరూ చేయి వేయరు. ఒక్క గడ్డపార, ఒక్క ప్రొక్లైనర్ కూడా రాదు. ఒకవేళ అన్యాయంగా మీ ఇళ్లపైకి వస్తే కోర్టుకు నేను వెళతా. కేసు వేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. ఆందోళన చెందకుండా పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి’ అని ధైర్యం చెప్పారు.

కాగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన కొన్ని కట్టడాలకు అధికారులు రెడ్ మార్క్ వేసిన విషయం తెలిసిందే. మూసీకి ఇరువైపులా పరీవాహక ప్రాంతానికి హద్దులను నిర్దారించారు. బఫర్‌ జోన్‌, ఫుల్‌ రివర్‌ లెవల్‌ పేరిట హద్దులను గుర్తించారు. ఇందులో రెడ్‌ లైన్‌ను రివర్‌ బెడ్‌గా పరిగణిస్తుండగా.. బ్లూ కలర్‌ లైన్‌ను ఎఫ్‌ఆర్‌ఎల్‌ అని అధికారులు స్పష్టం చేశారు. అయితే, రెడ్ మార్క్ వేసిన ఇళ్లను కూల్చబోతున్నారని ప్రచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మధుయాష్కీ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

Advertisement

Next Story