‘వారి గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోడీకి లేదు’

by GSrikanth |
‘వారి గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోడీకి లేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని బీజేపీ చీల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు మోడీకి లేదని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులు కాపాడుతామని భరోసా ఇచ్చారు. మతవిద్వేశాలను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారంటూ మోడీ వ్యాఖ్యలు చేయడం దారుణమని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.

Next Story