మెగాస్టార్, పవర్ స్టార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మోడీని చూసి నేర్చుకోవాలి: బక్క జడ్సన్ సెటైర్స్

by Disha Web Desk 19 |
మెగాస్టార్, పవర్ స్టార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మోడీని చూసి నేర్చుకోవాలి: బక్క జడ్సన్ సెటైర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. మోడీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆదివారం నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో మోడీ సాష్ఠాంగ నమస్కారం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇండియాలోని నటులైన సూపర్ స్టార్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్, రెబల్ స్టార్స్ అంతా.. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన మోడీని చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోడీ బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్టర్ అని.. ఆయన యాక్టింగ్‌కి ఆస్కార్ అవార్డు దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు.

అయితే, జడ్సన్ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దయచేసి మీ గౌరవాన్ని కాపాడుకోండంటూ ఓ నెటిజన్ సూచించగా.. మేము అత్యంత గౌరవనీయమైన కుర్చీకి గౌరవాన్ని అంగీకరిస్తున్నాం అంటూ జడ్సన్ రిప్లై ఇచ్చారు. అంతేకాదు, నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఒక సన్యాసికి ఆహ్వానం అందింది. కానీ, రాష్ట్రపతికి మాత్రం ఆహ్వానం అందలేదు అంటూ విమర్శించారు.

Next Story